Breaking News

బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం

రుద్రూర్‌లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం

రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు.

పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు గోపాల్ సెట్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లులో వారికి అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు బసకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అనంతరం భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగారం గ్రామానికి చెందిన పిట్ల సాయిలు మహారాజ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బండ రెంజల్ నుంచి బాసరకు పాదయాత్రగా వెళ్తామని తెలిపారు. పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ ప్రతి సంవత్సరం తన రైస్ మిల్లులో బస చేసేందుకు అవకాశం కల్పిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇందుకు ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.రుద్రూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం లంగాడాపూర్‌లో భోజనం చేసి, సాయంత్రం తడ్బిలోలిలో బస చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయానికల్లా బాసర చేరుకుని గోదావరిలో స్నానం చేసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో బచ్చు గోపాల్ సెట్ కుటుంబ సభ్యులు, వెంకటేశం సెట్, శ్రీరామ్ సెట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *