Breaking News

ఒకేరోజు రెండు స్వర్ణాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ చికిత!

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో బ్యాక్-టు-బ్యాక్ రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికితా రావు తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. వరుస మ్యాచ్‌ల ఒత్తిడిని జయించడానికి ప్రశాంతమైన మనస్తత్వంతో ఆడటమే తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఒత్తిడికి గురికాకుండా, హడావుడి చేయకుండా మైండ్‌సెట్‌ను నిలకడగా ఉంచుకోవడం వల్లే పతకాలు సాధించగలిగానని పేర్కొంది.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో జ్యోతి వెన్నం, ప్రీతిక ప్రదీప్‌లతో కలిసి ఫైనల్‌లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి చికిత తొలి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత సాహిల్ జాదవ్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రెండో స్వర్ణాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తన ఈ చారిత్రాత్మక విజయాన్ని తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు తెలిపిన చికిత.. సహకారం అందించిన కోచ్‌లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు భారత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఆసియా క్రీడల్లో ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటిన తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితా రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తన అద్భుత విజయంతో చికిత తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, రాష్ట్ర ఖ్యాతిని పెంచిందని కొనియాడారు. చికిత పట్టుదల, దృఢ సంకల్పం యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని సీఎం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత.. ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఉమెన్స్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లో సాధించిన ఈ విజయంతో ఆమె 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంపై క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *