కౌన్సిలర్ ఇర్ఫాన్ చేతుల మీదుగా చెక్కుల అందజేత.. కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
నిర్మల్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).
నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీకి చెందిన 21వ వార్డు గాజులపేట్ కౌన్సిలర్ ఇర్ఫాన్ అందజేశారు.ఈ సందర్భంగా నూర్జా బేగంకు రూ.20,000, ఖలీల్ అహ్మద్‌కు రూ.14,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కౌన్సిలర్ ఇర్ఫాన్ తన చేతుల మీదుగా అందజేశారు.
అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కౌన్సిలర్ ఇర్ఫాన్ చేసిన కృషి అభినందనీయమని లబ్ధిదారులు తెలిపారు. చెక్కులు మంజూరు కావడానికి సహకరించిన కౌన్సిలర్‌కు నూర్జా బేగం, ఖలీల్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కౌన్సిలర్ ఇర్ఫాన్ పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
