Breaking News

నిర్మల్‌ ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతల స్వీకరణ

నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్‌ కత్తి నరేందర్‌

నిర్మల్‌, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి).

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ జి. రమేష్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్‌, కౌన్సిలర్‌ కత్తి నరేందర్ డాక్టర్‌ జి. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నిర్మల్‌ జిల్లాలో వైద్య సేవల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ తరఫున మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు దర్శనం మహేష్‌, క్యాషియర్‌ రాజశేఖర్‌, సాగర్‌ తదితరులు పాల్గొని డాక్టర్‌ జి. రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *