Breaking News

ఈసీ ఆఫీస్ ఎదుట హైడ్రామా…బారికేడ్‌పైకి ఎక్కిన రాహుల్ గాంధీ

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ నుంచి ‘నిర్వాచన్ సదన్’ (ఎన్నికల సంఘం కార్యాలయం) వైపు సాగుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి నిరసన తెలపడమే కాకుండా అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘాన్ని ‘చీటింగ్ కమిషన్’గా అభివర్ణించిన కాంగ్రెస్, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10 నుంచి దేశవ్యాప్త నిరసనలు, బైక్ ర్యాలీలు, చౌపాల్స్ నిర్వహించి నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో విపక్షాలు ఉండగా, ఈసీ వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *