Breaking News

పండించింది సన్నధాన్యమే.. ధర మాత్రం రూ.3,300

సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధరలు తగ్గిస్తున్నారని రైతు బాపురావు ఆవేదన

బాన్సువాడ, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి)

తాను పండించిన సన్నధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని రైతు బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్నధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా రైతు బాపురావు మాట్లాడుతూ.. తాను పండించినది సన్నధాన్యమేనని, అయితే బియ్యం సరిగా రాదనే కారణంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కొంతమేరకు మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నప్పటికీ, స్థానికంగా ఉన్న బ్రోకర్లు, ధాన్యం దళారులు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని ఆరోపించారు.

మొన్నటి వరకు తన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.3,600 వరకు ధర లభించిందని, ప్రస్తుతం రూ.3,300కే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతుల తరఫున బాపురావు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సీపీకి ఫోన్ చేసి రైతుల సమస్యను దృష్టికి తీసుకెళ్లడంతో కొంతవరకు రైతులకు న్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

రైతులు పండించిన సన్నధాన్యానికి న్యాయమైన ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, దళారుల సిండికేట్‌పై నిఘా పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు బాపురావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *