Breaking News

గుమ్మిరాల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

ఏర్గట్ల, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో సందడిగా మారింది.విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయడంతో పాటు, మన సంస్కృతిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన, సాంస్కృతిక విలువల పట్ల గౌరవం పెంపొందుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, గౌతమి, అంగన్‌వాడీ కార్యకర్త సంతోష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *