Breaking News

వేములవాడలో పట్టుబడ్డ నాటుసారా!

వేములవాడ (e6tv news): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై అక్రమంగా నాటుసారాను తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్ఐ రమ్య ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను చాకచక్యంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ రమ్య తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *