Breaking News

మాజీ మంత్రి వేముల కేసీఆర్ పాలపై వ్యాఖ్యలు!

నిజామాబాద్ (e6tv news): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి స్వర్ణయుగంగా నిలిచిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కవులు, కళాకారుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతగాని పాలన సాగిస్తోందని, మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ప్రజలపై, బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *