Breaking News

మానవత్వాన్ని చాటుకున్న అంబేద్కర్ సంఘం సభ్యులు

బాధిత కుటుంబానికి రూ.5,400 ఆర్థిక సాయం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6 TV News: ప్రతినిధి)

కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి అంబేద్కర్ సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన ఇరాగాళ్ల సునీత గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘం సభ్యులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. సంఘం పిలుపు మేరకు అంబేద్కర్ వాదులు, సంఘ సభ్యులు తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో రూ.5,400 నగదును సేకరించి సునీత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పిన అంబేద్కర్ సంఘం సభ్యుల సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో అమృతరావు, సాయిలు, సాయిబాబా, సాయిలు శ్రీనివాస్, రోడ్డ కాశీరాం, ఏల్లుబాబు, ముత్యం, చిరంజీవి, సాయిరాం, మైపాల్, చంద్రశేఖర్, నాగరాజ్, తరుణ్ తేజ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *