దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించనున్నారు. ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సంబంధిత అధికారులతో వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలు:
- అక్టోబర్ 14, మధ్యాహ్నం 03:55: ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
- సాయంత్రం 06:25: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- సాయంత్రం 07:20 – 07:40: ఇంద్రకీలాడ్రిపై శ్రీ దుర్గ మల్లే్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడలోనే రాత్రి బస చేస్తారు.
- అక్టోబర్ 15, ఉదయం 11:30: పున్నమి ఘాట్ వద్ద జాతీయ స్థాయి ‘సారస్ మేళా’ (SARAS Mela)ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులతో కూడిన 600లకు పైగా స్టాల్స్‌ను ఆమె తిలకిస్తారు.
- మధ్యాహ్నం: స్వయం సహాయక సంఘాల (SHG) మహిళా సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 02:45: గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

