Breaking News

మూడు దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా దేవీ నవరాత్రి వేడుకలు

మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

పటాన్‌చెరు, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి).

పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్‌లో మహంకాళి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహంకాళి దేవాలయ సేవా సమితి సభ్యులకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మూడు దశాబ్దాలుగా సంప్రదాయాలను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్న సేవా సమితి సభ్యులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *