Breaking News

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేసిన వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రామ సభల తీర్మానాలు తీసుకోకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఏకపక్షంగా గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. ఈ విలీన ప్రక్రియ అంతా తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *