Breaking News

నిజామాబాద్: రూ.15 వేల లంచం తీసుకుంటూ చిక్కిన ఉద్యోగులు!

నిజామాబాద్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: శివ ఠాకూర్).

నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సంచలన దాడి నిర్వహించారు. కార్యాలయంలోని రెండవ అంతస్తులో గల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్, ఒక పౌరుడి పనులకు సంబంధించిన అనుమతుల కోసం రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు విరుచుకుపడ్డారు. బాధితుడి నుంచి రూ.15,000 నగదు స్వీకరిస్తుండగా జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడులు నిజామాబాద్ ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్ నేతృత్వంలో కొనసాగాయి. లంచం తీసుకుంటున్న అశోక్ కుమార్‌తో పాటు, అదే విభాగంలో అవినీతి చర్యలకు సహకరిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ కుమార్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుడి నుంచి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *