మద్నూర్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సామాజిక సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో శ్రీనివాస్ మెరుగే, కిషన్ శక్కరకోట, గంగాధర్ బండారి, వెంకటరమణ బిజ్జావార్, పోశెట్టి బండారి, రాజు దిడ్డివార్, బాలాజీ గడ్డపువార్, సంజు గడ్డపువార్, లక్ష్మణ్ టైలర్, రాములు గంజివార్తో పాటు పలువురు పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు.

