Breaking News

మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ

మద్నూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)

మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NRLM రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణ అందించారు.

రానున్న ఐదేళ్లలో సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయికి చేరుకోవాలనే అంశంపై ముందుచూపుతో విజన్‌ (కల)ను ఎలా రూపొందించుకోవాలో శిక్షణలో వివరించారు. ఆ విజన్‌ను సాకారం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలనే అంశాలను కూడా అవగాహన కల్పించారు.అదేవిధంగా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించడం, వాటిపై చిన్న గ్రూపులుగా చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవడంపై శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం జగదీష్ కుమార్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ సంఘం ప్రతినిధులు, గ్రామ సంఘం అసిస్టెంట్లు పాల్గొన్నారు.డోంగ్లి మండల కేంద్రంలో కూడా మోడల్ మండల సమాఖ్యలపై నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎం జగదీష్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *