భీంగల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)
మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ పట్టణంలోని చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.అనిల్ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కన్నె సురేందర్, బొదిరె స్వామి, జేజే నర్సయ్య, పర్స అనంతరావు, నాగేంద్రబాబు, సుంకరి సురేష్, అనిల్ గౌడ్, పర్స రత్నం, బొమ్మెన అజయ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.
అనిల్ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కన్నె సురేందర్, బొదిరె స్వామి, జేజే నర్సయ్య, పర్స అనంతరావు, నాగేంద్రబాబు, సుంకరి సురేష్, అనిల్ గౌడ్, పర్స రత్నం, బొమ్మెన అజయ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.


