Breaking News

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కోరిక తీర్చిన మంత్రి సీతక్క!

హన్మకొండ రెడ్డి కాలనీకి చెందిన రిషిత అనే చిన్నారి డ్యూచెన్ ముస్కులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన, ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో పాటు కంటిచూపు సమస్యతో బాధపడుతోంది. తనతో సెల్ఫీ దిగాలన్న బాలిక ఆకాంక్ష సోషల్ మీడియా ద్వారా తెలియడంతో పంచాయతీ రాజ్, సీతక్క (ధనసరి అనసూయ) నేరుగా రిషిత ఇంటికి వెళ్లి పరామర్శించి, ఫోటో దిగి ఆమె కోరికను తీర్చారు.

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క భరోసానిచ్చారు. రిషితకు హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో ఉచితంగా మెరుగైన వైద్య చికిత్స అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే కొణిదెల ఉపాసన నిర్వహిస్తున్న బ్లైండ్ స్కూల్‌లో చదువుకుంటున్న రిషిత, ఉపాసనను కూడా కలవాలని ఉందని తెలపడంతో ఆ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లి కలిసే ఏర్పాటు చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *