Breaking News

ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్:కానీ ఎందుకు?

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంతో పాటు పలు ఉద్యోగ సంబంధిత డిమాండ్ల సాధనకై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు (మూడు రోజుల పాటు) బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRBs) ప్రత్యక్ష బ్రాంచ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది.

రేపు (ఆదివారం) తెరుచుకోనున్న బ్యాంకులు: ఈ సమ్మె వల్ల ఖాతాదారులకు కలిగే ఇబ్బందులను నివారించేందుకు ఆర్‌బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సెలవు రోజైన సెప్టెంబర్ 27 (ఆదివారం) నాడు ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్‌ఆర్‌బీలు సాధారణ వేళల్లో పనిచేస్తాయని ప్రకటించింది. కాబట్టి నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్ వంటి అత్యవసర బ్రాంచ్ పనులను రేపే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి.

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో: సమ్మె కాలంలో బ్రాంచ్ కౌంటర్లు మూతపడినప్పటికీ.. ఏటీఎం (ATM), యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు క్యాష్ డిపాజిట్ మెషీన్లు (CDM) యథాతథంగా సేవలందిస్తాయని అధికారులు వెల్లడించారు. భౌతిక లావాదేవీల కంటే డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *