Breaking News

సర్వే డబ్బులు ఇప్పించాలని తహసీల్దార్‌కు బీఎల్‌వోల వినతి

ముధోల్, నవంబర్ 17: (E6tv NEWS).

ఎస్‌ఐఆర్‌ సర్వే విధులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు రావాల్సిన పారితోషికం చెల్లించలేదని ముధోల్ మండల బీఎల్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ముధోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ సర్వేకు సంబంధించిన విధులను పూర్తిస్థాయిలో నిర్వహించి పూర్తి చేసినప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు అందలేదని తెలిపారు. పక్క జిల్లాల్లో సర్వే విధులు నిర్వహించిన బీఎల్‌వోలకు ఇప్పటికే పారితోషికం చెల్లించారని, ముధోల్ మండలంలోని తమకు మాత్రం ఇంకా చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు.సర్వే విధుల కోసం సమయం, శ్రమ వెచ్చించి పనిచేశామని, తమకు రావాల్సిన సర్వే పారితోషికాన్ని వెంటనే ఇప్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు ప్రమీల, స్వరూప, రాణి, లలిత, వందన, సత్యవతితో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *