దెగాం, నవంబర్ 17: (E6tv NEWS).
విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూత అందించాలనే లక్ష్యంతో దెగాం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భోసలే మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోసలే మోహన్ రావు పాటిల్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప సంపద అని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించినట్లవుతుందని తెలిపారు.నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధికి తోడ్పడే ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ మరిన్ని చేపట్టాలని భోసలే మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ పేర్కొంది.
