National
అవకతవకలకు తావులేదు..
స్వయం సహాయక సంఘాల లావాదేవీలపై ప్రత్యేక దృష్టి బకాయిలు, స్త్రీనిధి రుణాల రికవరీకి చర్యలు వ్యక్తిగత కక్షలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పని చేయాలి: ఏపీఎం సువర్ణ సిరికొండ, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్). స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని సిరికొండ APM సువర్ణ స్పష్టం చేశారు. సంఘాల నిధులను దుర్వినియోగం చేసినా, లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….
ఐఐటీ బాంబే దళిత విద్యార్థి సూసైడ్: యాజమాన్యం క్షమాపణలు!
ముంబై: ఐఐటీ బాంబే (IIT-Bombay) క్యాంపస్‌లో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల దళిత విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి మృతిపై క్యాంపస్‌లో మూడో రోజూ నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఐఐటీ బాంబే యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను డీన్ పదవి నుంచి సోమవారం తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్…
పెట్రోల్ బాంబ్: లీటర్ రూ.150 వైపు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ బెంచ్‌మార్క్ ధరలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions), ముడి చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా దేశీయంగా పెట్రోల్ బెంచ్‌మార్క్ ధర ఏకంగా 50 నెలల గరిష్టానికి ($133.05 డాలర్లు per barrel) చేరుకుంది. దీంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై (OMCs) తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్ర…
కొత్త బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు ధ్వంసం
భారీ లారీల రాకపోకలు, పార్కింగ్‌తో రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసుల ఆవేదన చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్త బీసీ కాలనీ (పరిటాల రవీంద్ర కాలనీ)లో భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే మార్గంలో వెలుగు కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో 2024–25 ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.30…
ప్లాస్టిక్ రహిత బాల్కొండకు స్టీల్ బ్యాంక్ ప్రారంభం
బాల్కొండ, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి) ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో బాల్కొండ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత బాల్కొండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 3,000 స్టీల్ ప్లేట్లు, 1,000 స్టీల్ గ్లాసులతో స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యువజన సంఘాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలకు గ్రామపంచాయతీ స్టీల్ బ్యాంక్ నుంచి ఉచితంగా స్టీల్ ప్లేట్లు,…
ఏఐకేఎంఎస్ నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య బిచ్కుంద, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో శనివారం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను…
రోస్టర్‌లో మాలలకు న్యాయం చేయాలి
అక్టోబర్ 4న హైదరాబాద్‌లో మాలల బహిరంగ సభ మద్నూర్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి) రోస్టర్ పాయింట్లలో మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో మాలల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్నూర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల…
చిత్తారి హరిబాబు హత్య కేసులో A-1 అరెస్ట్
ప్రతీకారంతోనే హత్యకు పథకం.. కత్తితో దాడిచేసిన గంధం సంతోష్ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో రెండు కత్తులు, రెండు కర్రలు స్వాధీనం నిజామాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన చిత్తారి హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు (A-1) గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన సుమారు ఒకటిన్నర రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్…
వర్షాభావ పరిస్థితుల్లో కేంద్ర సహకారం అందించాలి
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి E6tv NEWS: (సెప్టెంబర్ 18). ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర…
నెస్లే ఇండియాపై న్యాయపరమైన చర్యలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నిర్ణయం!
చిన్నారుల పోషకాహార ఉత్పత్తులలో (Infant Nutrition Products) ఆహార భద్రతా ప్రమాణాలు, నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ప్రముఖ బహుళజాతి సంస్థ ‘నెస్లే ఇండియా లిమిటెడ్’ (Nestle India Ltd) పై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది. నెస్లేకు చెందిన మూడు ప్రముఖ ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వేర్వేరుగా మూడు అడ్జుడికేషన్ (విచారణ) కేసులను నమోదు చేసింది. కేసు నమోదుకు దారితీసిన ప్రధాన కారణాలు: స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టపరమైన…
