National
గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు
డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…
హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…
నీట్ పేపర్ లీక్‌పై నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మైనారిటీ ర్యాలీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల…
వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…
వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజలకు…
విద్యార్థులపై దాడి అమానుషం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్‌లో మహాధర్నా ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు…
నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?
జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…
చాగంటి రాకతో రూరల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం
ప్రవచన చక్రవర్తికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం నిజామాబాద్, జూలై 23: E6 tv NEWS (శివ ఠాకూర్). ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 24న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి విచ్చేయనున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య…

