News
భారత్–పాక్ యుద్ధ వీరుడు: లెఫ్టినెంట్ కర్నల్ తారాపోర్ వర్ధంతి !
16 సెప్టెంబర్… భారత సైనిక చరిత్రలో ఒక మహావీరుడిని స్మరించుకునే రోజు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్ధభూమిలో చివరి శ్వాస వరకు పోరాడిన పరమవీర చక్ర గ్రహీత, లెఫ్టినెంట్ కర్నల్ అర్దేశిర్ బుర్జోర్జీ తారాపోర్ వర్ధంతి నేడు. 1923 ఆగస్టు 18న జన్మించిన తారాపోర్, చిన్ననాటి నుంచే ధైర్యం, క్రమశిక్షణలను అలవరుచుకుని భారత సైన్యంలో చేరారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో సియాల్కోట్ సెక్టార్లో జరిగిన తీవ్రమైన ట్యాంకుల పోరాటంలో ‘పూణే హార్స్ రెజిమెంట్’…
QRతో గణేష్ నిమజ్జనం పాయింట్:Cyberabad అధికారులు!
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఒక వినూత్న డిజిటల్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమ సమీపంలోని నిమజ్జన ప్రాంతాలను (Immersion Points) సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక QR కోడ్‌తో పాటు ఆన్లైన్ లింక్‌ను విడుదల చేసింది. సైబరాబాద్ వ్యాప్తంగా మొత్తం 53 నిమజ్జన ప్రాంతాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ టూల్ ద్వారా భక్తులు తమ ఫోన్ లోకేషన్ ఆన్ చేసి సమీపంలోని నిమజ్జన ఘాట్లు,…
సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి: బిజెపి డిమాండ్!
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ (BJP) వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విమోచనం లభించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజుకు తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను…
నెల్లూరు అభివృద్ధికే ప్రాధాన్యం: వైసీపీపై మంత్రి నారాయణ ఫైర్!
నెల్లూరు: నెల్లూరు నగర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న పనులపై వైసీపీ నేతలు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారిదిన్నెలో రూ.35 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన ‘స్వర్ణ వార్డు’ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిలిపివేసిన భూగర్భ డ్రైనేజీ (UGD) పనులతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను…
సంతోష్‌నగర్ కిడ్స్ స్కూల్లో అగ్నిప్రమాదం: తప్పిన ముప్పు!
హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ రోడ్లో ఉన్న ఓ రెండు అంతస్థుల ప్రైవేట్ కిడ్స్ స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో పాఠశాల, రెండో అంతస్తులో నివాస గృహం ఉండటంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై భవనంలోని వారిని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్…
గణనాథుడికి కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు!
హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవెల్లి నివాసంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ధార్మిక క్రతువులో కేసీఆర్, ఆయన సతీమణి శోభలతో పాటు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా పాల్గొని తాత, నానమ్మలతో కలిసి ఏకదంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ వారు మట్టి వినాయకుడికే పూజలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్…
పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన..
విదేశీ ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16 వరకు సమయం ఉన్నప్పటికీ, ఒకరోజు ముందే ఆమె న్యాయవాదులతో కలిసి మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు ఆమెపై 20కి పైగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలు,…
చివరి రోజు సభ ముందుకు రానున్న అత్యంత కీలక బిల్లులు…
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం మొదలైన ఈ సెషన్ చివరి రోజైన నేడు, సభ ముందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక బిల్లులు రానున్నాయి. సభను మరో రోజు పొడిగించడంతో నేటి అజెండా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాసనసభలో ఉదయం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. నేడు సభలో ప్రధానంగా నిషేధిత భూముల జాబితా (Section 22A) వివాదం మరియు ఎల్‌నినో ప్రభావాలపై…
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్: షాక్‌లో గణేష్ ఉత్సవ కమిటీలు!
హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు సిటీ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ల పేరిట ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వెలిసిన హెచ్చరిక ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరంలో తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోర్టు నిబంధనలకు లోబడి ఉత్సవ…
సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ
పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్…
