Breaking News

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ

కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)  నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…

Read Full News

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి). టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్…

Read Full News

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ముప్పు: పోరంకి వద్ద తీవ్ర కలకలం!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి వద్ద ఏర్పాటు చేసిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు మండలం పోరంకి వద్దకు కాన్వాయ్ చేరుకోగానే, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు. వాహనాలు వేగంగా వస్తున్న సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో…

Read Full News

అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా:అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే ఆర్మ్‌ర్ రాకేశ్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, కేవలం కొడంగల్, పరిగి వంటి కొన్ని కొన్ని ప్రాంతాలకే భారీగా నిధులు కేటాయిస్తూ తమ జిల్లాను విస్మరిస్తున్నారని సభలో మండిపడ్డారు. ఆర్మూరులో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌వో, సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలు కూలిపోయే స్థితికి చేరాయని, క్లర్క్ స్థాయి అధికారి కూర్చోవడానికి…

Read Full News

భాగ్యనగరంలో భూగర్భ జలాల డేంజర్ బెల్స్!!!

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు ఆందోళనకర రీతిలో అట్టడుగు స్థాయికి పడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరచడంతో పాటు 22 శాతం వర్షపాతం లోటు నమోదు కావడం, మరోవైపు నగరవాసుల నీటి వినియోగం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో సగటున 6.36 మీటర్ల లోతులో లభ్యమైన నీటిమట్టం, ఈ ఏడాది ఏకంగా 11.20 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే సగటున దాదాపు 5 మీటర్ల…

Read Full News

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ సన్నాహాలు

శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పురోగతిని ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్…

Read Full News

రోడ్డు పక్కన భారీగా ప్రభుత్వ మందులు: పట్టుకున్న వైద్య సిబ్బంది!

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులోని నేషనల్ హైవే-44 పక్కన భారీగా ప్రభుత్వ మందులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేయాల్సిన మెడిసిన్‌ను కొందరు వ్యక్తులు మినీ డీసీఎం వ్యాన్‌లో తీసుకొచ్చి రోడ్డు పక్కన పారబోస్తుండగా స్థానిక వైద్య సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంకా కాలపరిమితి (వ్యాలిడిటీ) ఉన్న సుమారు ₹15 లక్షల విలువైన మందులను ఈ విధంగా పారబోస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా బస్వాపూర్,…

Read Full News

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన జోస్ బట్లర్: టీ20ల్లో ఆల్-టైమ్ రికార్డు!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సంచలన మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను (4,231 పరుగులు) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. సౌతాంప్టన్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. శ్రీలంకపై కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు సాధించిన బట్లర్, తన మొత్తం…

Read Full News

నాని ‘ది ప్యారడైజ్’కి ‘A’ సర్టిఫికెట్!

నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, రక్తపాతం, బోల్డ్ కంటెంట్ కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ఓవర్సీస్ డిస్పాచ్, ప్రమోషనల్ పనుల ఆలస్యం కాకుండా ఉండేందుకు ఫైనల్ కట్ కంటే ముందే రఫ్ కట్ వెర్షన్‌ను…

Read Full News

బిగ్ బాస్ ట్విస్ట్: త్రిగుణ్‌కు నెక్‌టూనెక్‌ పోటీ ఇస్తున్న రోహిత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్స్ కారణంగా ఈసారి ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. సాధారణ నామినేషన్ పద్ధతికి భిన్నంగా నిర్వహించిన ‘రోప్ టాస్క్’లో ఓడిపోయిన వారు నేరుగా నామినేట్ కాగా.. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేషన్ లిస్టులోకి చేరారు. అమన్, వంశీ, నరేష్‌లకు…

Read Full News