Breaking News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం 14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు 170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్…

Read Full News

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం: ఎంపీ అర్వింద్

రాహుల్, రేవంత్, మహేశ్ గౌడ్ వల్ల బీజేపీకి మరింత ప్రయోజనం 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి కేంద్ర పథకాల్లో మోదీ ఫొటో తప్పనిసరిగా ఉండాలి: అర్వింద్ నిజామాబాద్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: శివ ఠాకూర్). రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

Read Full News

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి: లైసెన్స్ రద్దుకు నివేదిక!

హైదరాబాద్: భాగ్యనగరంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ విరుచుకుపాటును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రముఖ ‘M/s బహార్ బిర్యానీ కేఫ్’లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నిల్వ ఉంచిన నాణ్యత లేని ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హోటల్ వంటగది నుంచి సుమారు 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన…

Read Full News

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 25 ఈ-బస్సులు ప్రారంభం:తిరుమల

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో 25 విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను టీటీడీకి విరాళంగా అందించింది. ఈ నూతన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో ఘనంగా ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేశ విదేశాల…

Read Full News

బ్యాంక్ ఖాతాల్లో రూ. 3 కోట్లు… కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి!

హైదరాబాద్: సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ మాజీ అడ్మినిస్ట్రేటర్ ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పైరసీ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీజ్ చేసిన తన ఖాతాల్లోని నిధులను తిరిగి విడుదల చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ…

Read Full News

22-A భూసమస్యలకు చెక్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా వేధిస్తున్న 22-A (నిషేధిత భూముల) సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 22-A పరిధిలోని 12 ప్రధాన అంశాలను ప్రభుత్వం గురింఛిందని, సమస్య పరిష్కారానికి త్వరలోనే సమగ్ర విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల వ్యవహారంలోనూ త్వరలోనే నూతన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. హెచ్‌ఎండిఏ (HMDA), డీటీసీపీ (DTCP) వంటి నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన అధీకృత లేఔట్లలో…

Read Full News

చేయూత పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ పరిశీలన

భీంగల్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో నూతనంగా చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్.. దరఖాస్తుదారుల వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని వెరిఫికేషన్ అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా…

Read Full News

హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలు..

హైదరాబాద్: పసిడి ప్రేమికులకు చేదు వార్త. భాగ్యనగరంలో బంగారం ధరలు మరోసారి కదలికలోకి వచ్చి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువలో మార్పులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు ₹1,53,440 వద్ద నమోదైంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

Read Full News

ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు:మంత్రి లోకేశ్‌!

నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నెల్లూరు నగరంలో భారీ మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసిన ఆర్.ఎస్.ఆర్., దేవిరెడ్డి శారద (డీఎస్ఆర్‌) ప్రభుత్వ పాఠశాల భవనాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం వైభవంగా ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో…

Read Full News

భాగ్యనగరంలో మూడో రోజున మొదలైన గణనాథుల నిమజ్జనాలు…

హైదరాబాద్: 11 రోజుల వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైంది. జిహెచ్‌ఎంసి (GHMC), సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వివిధ చెరువులు, కృత్రిమ ఘాట్ల వద్ద నిమజ్జనాలు సాగుతున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్‌పై విగ్రహాల నిమజ్జనాన్ని అనుమతించడం లేదని స్పష్టం చేస్తూ అధికారులు ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేశారు. భక్తులు మరియు పండల్ నిర్వాహకులు నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ లేదా నెక్లెస్ రోడ్…

Read Full News