Breaking News

నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?

కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…

Read Full News

బోధన్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు నోటిఫికేషన్

రూ.1 లక్ష దరఖాస్తు రుసుము.. వార్షిక రుసుము రూ.42 లక్షలు నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tv NEWS: శివ ఠాకూర్). బోధన్ పట్టణంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్, ఐఏఎస్ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించి, ఆధార్…

Read Full News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు…

Read Full News

గ్రామ కమిటీలపై బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం:నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో గ్రామ కమిటీల (వీడీసీ) వ్యవహారశైలిపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా స్పందించారు. గ్రామ కమిటీలు తమ పరిధి దాటి ‘సుప్రీం లా’గా వ్యవహరిస్తూ, మాట వినని అమాయకులను గ్రామ బహిష్కరణకు గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఏకంగా ఒక ఎమ్మెల్యేను సైతం గ్రామ బహిష్కరణకు గురిచేసిన చరిత్ర ఈ కమిటీలకు ఉందని గుర్తుచేశారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బహిష్కరణకు గురైన పలువురు బాధితుల నుంచి ఆయన…

Read Full News

పోలవరం ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ రద్దుకు కేంద్రంతో ఏపీ సీఎం చర్చలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిర్మించాల్సిన రక్షణ గోడలపై పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన కోరారు. సమావేశంలోని ప్రధాన ముఖ్యాంశాలు:

Read Full News

పండుగల వేళ యూపీఐ ఛార్జీలు జనవరికి వాయిదా?!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన 0.4% ఇంటర్‌ఛేంజ్ రుసుము (MDR) అమలును అక్టోబర్ 15 నుంచి కాకుండా వచ్చే ఏడాది జనవరి వరకు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న దసరా, దీపావళి పండగల సీజన్‌లో వ్యాపారులపై భారం పడకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. కీలక విషయాలు & ముఖ్యాంశాలు:

Read Full News

చలిపై ఎల్‌నీనో ప్రభావం పెరగనున్న ఉష్ణోగ్రతలు

ఎల్‌నీనో ప్రభావం వల్ల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం లోటు నమోదు కాగా, రాబోయే చలికాలంలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రధాన ముఖ్యాంశాలు:

Read Full News

ఐసీసీ 2027 వరల్డ్ కప్ కోసం ఫ్యాన్స్ క్యూ

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 టికెట్ల వేటలో అభిమానులు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. అక్టోబర్ 1, 2026న టికెట్ బ్యాలెట్ ప్రారంభమైన కేవలం 48 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. ముఖ్య విశేషాలు:

Read Full News

దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ

చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు…

Read Full News

ధాన్యం దళారులు, వ్యాపారస్తులు శాపంగా మారారు

ఇతర రాష్ట్రాల వ్యాపారులు క్వింటాకు రూ.3,700–3,800 చెల్లిస్తున్నా.. స్థానిక దళారుల తీరుతో ధరలు పడిపోతున్నాయంటున్న రైతులు దళారులు సిండికేట్‌గా ఏర్పడి ఇతర వ్యాపారులను రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ.. చర్యలు తీసుకోవాలని వేడ్కోలు పోతంగల్, అక్టోబర్ 8 (E6TV NEWS: ప్రతినిధి)ధాన్యం విక్రయించే సమయంలో స్థానిక దళారులు, వ్యాపారస్తుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు క్వింటాకు రూ.3,700 నుంచి రూ.3,800 వరకు ధర చెల్లించేందుకు…

Read Full News