News
ఇందిరానగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్‌లో సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవం మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS(M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న…
అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి…
గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హండె కేలూర్ గ్రామస్తుల వినతి
మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా…
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాల పంపిణీ
జుక్కల్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఈ గోడ గడియారాలను అందజేసినట్లు గ్రామ సర్పంచ్ వి. రమణా సురేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా…
నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…
అమెరికా ‘ఆటా’ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి పిలుపు: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి!
వాషింగ్టన్ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేవలం భారత్‌లోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగిన 19వ ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (ATA) జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్ఆర్‌ఐలకు పిలుపు – పరిశ్రమలకు రెడ్ కార్పెట్: ఖండాంతరాలు దాటి తమ కష్టార్జితంతో ఉన్నత…
ఆదిలాబాద్‌లో బంగ్లాదేశ్ చోరుల ముఠా అరెస్ట్: నకిలీ ఆధార్‌తో చొరబడి దొంగతనాలు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులతో సహా మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలు: కుక్కర్లు అమ్ముతూ రెక్కీ.. రాత్రి వేళల్లో చోరీలు! జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను…
భీంగల్‌లో ఘనంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
భీంగల్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్…
ఏర్గట్లలో ఘనంగా సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఏర్గట్ల, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి, టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు…

