News
విదేశీ ఉద్యోగార్థులకు ‘టామ్‌కామ్’ ద్వారా సమగ్ర సేవలు: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
హైదరాబాద్: తెలంగాణ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు శిక్షణ ఇవ్వడం, జాబ్ మేళాలు నిర్వహించడం, పాస్‌పోర్ట్ సేవలు అందించడం మరియు విదేశాల్లో మంచి ఉద్యోగాలు కల్పించే మొత్తం ప్రక్రియ బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM – టామ్‌కామ్)కే అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ‘శక్తి’ (SHAKTI – Skill Human Capital and Knowledge Training Initiatives) శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు….
ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం
నిజామాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం.. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS శివ ఠాకూర్. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు బహిరంగంగా…
ఆగస్టు 15 వరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమలు
విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS). ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్,…
టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్‌ల నియామకాలు
ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని…
ముధోల్ శిశు మందిర్‌లో రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌కు సన్నాహాలు పూర్తి
ముధోల్, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ (విజ్ఞాన మేళా)ను ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సైన్స్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శిశు మందిరాల నుంచి సుమారు 500…
బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్‌లో క్షేమంగా లభ్యం
బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్‌పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ…
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్‌కు కేంద్రం సానుకూల స్పందన
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు….
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను దారుణంగా మోసం చేస్తోంది.. బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర ధ్వజం!
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేస్తోందని భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా, తమ హక్కుల కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీఛార్జీలు, పోలీసు బలగాలను ప్రయోగిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు….
ఆపదలో ఆపద్బాంధవుడిగా మాజీ ఉప సర్పంచ్ గడ్డం సుభాష్
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ…
లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు: కల్వకుంట్ల కవిత
ప్రభుత్వ ఈవీ ఆటోల నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే అవకాశం కల్పించాలని డిమాండ్ ఆటో డ్రైవర్లకు అండగా ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆమె,…

