Hyderabad
కొక్కొండలో సారీ ఫంక్షన్ సందడి.. చిన్నారులకు సుభాష్ రెడ్డి ఆశీస్సులు!
ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో సారీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ముత్యం కుమార్తెలు సౌమ్య, స్పందన, సాత్వికల సారీ ఫంక్షన్ శుక్రవారం వారి నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చిన్నారులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు….
కరెంట్ కోతలు – నీటి ఎద్దడి: రైతులకు తప్పని పంట నష్టం భయం!
తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లముందే చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్ మండలం మిట్టపల్లిలో ఎండిపోతున్న పొలానికి ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుండగా, వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతలను తట్టుకోవడానికి డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు. డీజిల్ ఖర్చు తమకు అదనపు భారంగా మారుతోందని, పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు….
రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పే రోజులు వస్తున్నాయి: కేటీఆర్
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తాత్కాలికమేనని, త్వరలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో…
అమ్మమ్మ 100వ జన్మదినోత్సవానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv NEWS: శివ ఠాకూర్). గందె కళావతి అమ్మమ్మ 100వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ, ఒక శతాబ్దపు జీవిత ప్రయాణం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. వందేళ్ల జీవితంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు మిళితమై ఉంటాయని అన్నారు.కుటుంబ సభ్యులకు అమ్మమ్మ అందించిన ప్రేమ, ఆప్యాయతలు, విలువలు, ఆశీర్వాదాలు…
ట్రాఫిక్ కష్టాలకు చెక్: శంషాబాద్, రాజేంద్రనగర్‌లలో 100 ఫీట్ల రోడ్లు!
శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక అడుగు వేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన 100 అడుగుల రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. దీనికోసం దాదాపు 23,496 చదరపు గజాల భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా గొల్లాపల్లి NH-44 జంక్షన్ నుండి పెద్ద గోల్కొండ వరకు ఒక కారిడార్, అలాగే ORR సర్వీస్ రోడ్డు నుండి బండ్లగూడ జాగీర్,…
నవంబర్ 6లోపు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: పొన్నం
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ నవంబరు 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధమని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామా…
గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
నాణ్యతలో రాజీ వద్దు.. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి: ప్రత్యేక అధికారి హనుమంతరావు కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ప్రత్యేక అధికారి నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, పుష్కరాల ప్రత్యేక అధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్…
అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి సరికొత్త వ్యూహం… :సీఎం రేవంత్ రెడ్డి
సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా మరియు మారుతున్న నేర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల మధ్య పటిష్ట సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సదరన్ రీజియన్ పోలీస్ కోఆర్డినేషన్ కమిటీ (SRPCC) సమావేశంలో పాల్గొన్న ఆయన, మారుతున్న నేర సరళికి అనుగుణంగా పోలీసు సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు…
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం..
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో (విమానం నం. AI 417) టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాలకే హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సమయస్ఫూర్తి: విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. ల్యాండింగ్‌కు…
‘గ్రీన్ వాటర్’తో హైదరాబాద్‌లో నీటి కష్టాలకు చెక్..
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడంతో పాటు తాగునీటి వనరులపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ వాటర్) తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించేలా ‘గ్రీన్ వాటర్’ సరఫరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నగర శివారులోని కోకాపేటలో ప్రత్యేకంగా గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను జలమండలి పరిశీలించింది. నాణ్యత, పర్యవేక్షణపై…
