Breaking News

రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పే రోజులు వస్తున్నాయి: కేటీఆర్

దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తాత్కాలికమేనని, త్వరలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటగతే భవిష్యత్తులో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలపై యువత తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *