Karimnagar
గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్
నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్). స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్‌లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ…
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు మరియు భూమి సర్వే నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) మంచికట్ల రాహుల్ గురువారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంఘటన వివరాలు: లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ పోలీసులు, ఆర్‌ఐ రాహుల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.
గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…
కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ…
బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం
బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…
భీమ్‌గల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీమ్‌గల్, ఆగస్టు 12: E6 tv NEWS(T. గంగాధర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని సుదర్శన్ థియేటర్ నుంచి సుమంగళి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
CEIR పోర్టల్‌తో 8 సెల్‌ఫోన్లు రికవరీ
యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR…
అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర
మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు. విజయ్ దళపతి ముఖ్యమంత్రి…
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. 40 కేసులు నమోదు
20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్ నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు…
భీంగల్‌లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…

