Medchal
గ్రామీణ యువ క్రికెటర్లను గుర్తించడమే లక్ష్యం
అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి: మచ్చా రామలింగారెడ్డి అనంతపురం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో ‘రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు RDT క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువ…
ఘనంగా పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలు
ధర్మవరం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, వార్డుల్లో పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. పుట్టినరోజు సందర్భంగా ధర్మవరం పట్టణ టీడీపీ నాయకులు దుర్గమ్మ దేవాలయంలో పరిటాల శ్రీరామ్ పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా అల్పాహారం అందజేశారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం…
కుల సంఘాలే అర్హులను నిర్ణయించాలి
రుద్రూరులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం రుద్రూరు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూరు మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం నిర్వహించిన గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది. కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘాల్లోని అర్హులైన నిరుపేదల జాబితాను అధికారులకు అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కుల సంఘాల నుంచి అర్హుల జాబితా గ్రామంలో ఉన్న కుల సంఘాలు…
మండల సమాఖ్యలపై మోడల్ శిక్షణ
రానున్న ఐదేళ్లలో సంఘాల అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి విజన్ సాధనకు పక్కా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచన మద్నూర్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. NRLM స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణను అందించారు. ఐదేళ్ల అభివృద్ధికి విజన్ రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయిలో…
కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలి
శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్‌కు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు పుట్టపర్తి, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులకు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను పుట్టపర్తి కార్మిక కర్షక భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదన్ అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శిక్షణా తరగతుల ప్రారంభానికి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు జెండాను ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన…
రోగుల పరామర్శను కూడా రాజకీయం చేస్తారా?
ప్రభుత్వం,పోలీసులు కనీస మానవత్వంతో వ్యవహరించాలి భేషరతుగా క్షమాపణ చెప్పి.. కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ (E6tv NEWS: సెప్టెంబర్ 22). వరంగల్‌లో చోటుచేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. సీనియర్ ప్రజాప్రతినిధితో…
మహిళల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జమ్మికుంట, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ, 7వ వార్డు దుర్గా కాలనీలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా కలిసి తొలిసారిగా శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో…
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
జీవో 52 రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల…
తానూర్‌లో ఇంటిపై పిడుగుపాటు
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. భారీగా ఆస్తి నష్టం తానూర్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షం సమయంలో ఓ మూడు అంతస్తుల ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటు ధాటికి ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పిడుగు ప్రభావంతో ఇంట్లోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ తదితర…
ముధోల్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
ముధోల్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతినిధి)ముధోల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు…
