మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ
జమ్మికుంట, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ, 7వ వార్డు దుర్గా కాలనీలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహిళలంతా కలిసి తొలిసారిగా శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ వాసులు, భక్తులందరిపై శ్రీ గణేశుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.గణేశుని కరుణాకటాక్షాలతో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరుకున్నారు.



