Breaking News

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి 70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్…

Read More

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను…

Read More

మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్

కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ మిల్లుల గోదాముల్లో విస్తృత తనిఖీలు మద్నూర్ ఆగస్టు 9: (E6 tv NEWS: M, మస్నాజీ) అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు….

Read More

పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను తెలుసుకోవాలి ఏర్గట్ల, ఆగస్టు 08: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్)మండల కేంద్రం ఏర్గట్లలో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి,…

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య కమ్మర్‌పల్లి, ఆగస్టు 8: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్లు…

Read More

మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణాపై ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం

నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా కేసుల నమోదు.. భారీగా గంజాయి, కల్లు స్వాధీనం వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన, వినియోగదారులకు కౌన్సెలింగ్ నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణా, గుడుంబా తయారీపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు DPEO నిజామాబాద్ పరిధిలోని వివిధ SHO పరిధుల్లో NDPS, కల్లు, గుడుంబా తదితర కేసులను నమోదు…

Read More

బాధిత వికలాంగుడికి పోలీసుల భరోసా

దాతల సహకారంతో ట్రై సైకిల్ అందజేసిన ఎస్ఐ నరేష్ హుజూర్‌నగర్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ హుజూర్‌నగర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన వికలాంగుడు ఇందిరాల పిచ్చయ్యకు దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్‌ను అందజేశారు. పిచ్చయ్య గత నెలలో తన ఇంటి ఎదుట ట్రై సైకిల్‌ను పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో ట్రై…

Read More

నిజామాబాద్ నగర అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్లు, వంతెనలు, కొత్త జాతీయ రహదారి కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్) నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…

Read More

కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకే జనసేన ఆవిర్భావం: మీసాల శ్రీనివాసరావు

ఆగస్టు 8న నిజామాబాద్‌లో జనసేన రెండు జిల్లాల సన్నాహక సమావేశం రాష్ట్ర ముఖ్య నాయకులంతా హాజరవుతారని వెల్లడి కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్). కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సంయుక్త సన్నాహక సమావేశాన్ని ఈ నెల 8వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు…

Read More

ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…

Read More