Breaking News

సీఎం విజయ్ పర్యటన:కనకదుర్గ ఆలయం వద్ద హై-సెక్యూరిటీ

విజయవాడ ఇంద్రకీలాడ్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గ మల్లే్వర స్వామి వార్ల దేవస్థానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సందర్శించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల వేళ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాడ్రిపై పోలీసులు అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సీఎం విజయ్ పర్యటన షెడ్యూల్ వివరాలు:

  • మధ్యాహ్నం 02:30: నీలంకరై క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 03:00: ప్రత్యేక విమానంలో చెన్నై నుండి బయలుదేరుతారు.
  • సాయంత్రం 04:00: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఘన స్వాగతం తరువాత రోడ్డు మార్గంలో కనకదుర్గ ఆలయానికి బయలుదేరుతారు.
  • సాయంత్రం 04:55 – 05:45: కనకదుర్గ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.
  • సాయంత్రం 05:45 – 06:00: ఇద్దరు ముఖ్యమంత్రులు ఏపీ సీఎం నివాసానికి చేరుకుంటారు.
  • సాయంత్రం 06:00 – 07:00: ఏపీ సీఎం అధికారిక నివాసంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు.
  • రాత్రి 07:10 – 08:00: పున్నమి ఘాట్ వద్ద జరిగే ఉత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
  • రాత్రి 09:00: గన్నవరం నుండి విమానంలో చెన్నైకి తిరుగు పయనం అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *