Breaking News

భిక్కనూర్ గ్రామ పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, నవంబర్ 16:(E6tvNEWS).

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో భిక్కనూర్ గ్రామానికి చెందిన అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భిక్కనూర్ గ్రామ సర్పంచ్ చాకలి సాయిలు, మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. భిక్కనూర్ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *