Breaking News

శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులు వేగవంతం

వాల్ టు వాల్ సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు

పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నవంబర్ 16:(E6tv NEWS).

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు.డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, గోపీనగర్ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సీసీ రోడ్లు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.వాల్ టు వాల్ సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా రహదారులు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న అరుగులు, ర్యాంపులను బస్తీ వాసులు స్వచ్ఛందంగా తొలగించి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ సహకరిస్తే నాణ్యమైన రహదారుల నిర్మాణం సాధ్యమవుతుందని, భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

గతంలో డ్రైనేజీ నెట్‌వర్క్ లేని బస్తీలలో సైతం డ్రైనేజీ పైపులైన్ల సౌకర్యం కల్పించి, అనంతరం నూతన సీసీ రోడ్లు నిర్మిస్తున్న కార్పొరేటర్ కృషిపై స్థానిక బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బీమన్ శ్రీను, వెంకటయ్య, విజయ్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *