Breaking News

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ మాజీ బూత్ అధ్యక్షుడికి ఆర్థిక సాయం

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎన్నారై బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్

ప్రతినెలా మందుల ఖర్చులకు సహాయం అందిస్తామని హామీ

రుద్రూర్, నవంబర్ 07 (E6tv న్యూస్).

అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్తకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్నారై కోనేరు శశాంక్. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన బీజేపీ మాజీ బూత్ అధ్యక్షుడు మూడ్ బాబు నాయక్ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న కోనేరు శశాంక్ వెంటనే స్పందించారు.

బాబు నాయక్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇస్తూ ఆసుపత్రి ఖర్చులు, మందుల కొనుగోలు నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000 అందజేశారు. అంతేకాకుండా ప్రతినెలా అవసరమైన మందుల కొనుగోలుకు కూడా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.కష్టకాలంలో పార్టీ కార్యకర్తను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కోనేరు శశాంక్‌కు స్థానిక బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఇందూరు జిల్లా కార్యవర్గ సభ్యులు వంకరి రామరాజు, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు బేగరి వినోద్ కుమార్, రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఎస్. నర్సింగ్, బాలాజీతో పాటు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *