Breaking News

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS).

అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త కుటుంబానికి బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త జిలకరి మహేందర్ తండ్రి జిలకరి సాయిలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న కోనేరు శశాంక్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని నాయకులు పేర్కొన్నారు. కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కటిక రామరాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకులు బొజిగొండ అనిల్, బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల నాయకులు జిలకర విజయ్, గాన్ల ప్రవీణ్, బూత్ అధ్యక్షుడు గొల్ల శంకర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *