Breaking News

విశాఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చికెన్ పట్టివేత

విశాఖపట్నం బీచ్ రోడ్డులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడ్డాయి. ప్రముఖ కామత్ హోటల్‌లో దాదాపు 60 కిలోలు, పిస్తా హౌస్‌లో 30 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టమైన హెచ్చరికలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *