Breaking News

38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు

గాండ్ల సంఘం ఆత్మగౌరవ భవనానికి రూ.1.50 లక్షలు కేటాయింపు

38 బీసీ కుల సంఘాలకు మొత్తం రూ.88.50 కోట్ల నిధులు మంజూరు

జీవో, ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

శేరిలింగంపల్లి, నవంబర్ 07 (E6tv న్యూస్).

తెలంగాణ రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గాండ్ల, తెలికుల, దేవతెలికుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.1.50 లక్షల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రొసీడింగ్ పత్రాలను అందజేసింది.కోకాపేటలోని హెచ్ఎండీఏ పరిధిలో సర్వే నంబర్ 240, ప్లాట్ నంబర్ 15లో కేటాయించిన ఒక ఎకరం స్థలంలో గాండ్ల సంఘం ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 38 బీసీ కుల సంఘాల ప్రతినిధులకు జీవో పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ కుల సంఘాలకు గతంలో కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీసీ కుల సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో కేటాయించిన నిధుల కంటే పెంచి, 38 కుల సంఘాల భవన నిర్మాణాల కోసం మొత్తం రూ.88.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేసి, ఏడాది లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంఘాల ప్రతినిధులు కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గాండ్ల తెలికుల సంఘం అధ్యక్షుడు అసోల్ల రాజేందర్, గౌరవ అధ్యక్షుడు బిక్కమల్ల రాంచందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూతురు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొసరి సురేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె. లక్ష్మీనారాయణ, ఐటీ సెల్ ఇన్‌చార్జి గుండ్ల శ్రీనివాస్‌తో పాటు గాండ్ల, దేవగాండ్ల కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *