వడ్డేపల్లి దినేష్ రెడ్డికి జిల్లా హ్యాండ్‌బాల్ పగ్గాలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ
ఎల్లారెడ్డి, నవంబర్ 07 (E6tv న్యూస్).
కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి దినేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సదాశివనగర్ మండలం భూంపల్లిలోని జీపీ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాల్రెడ్డి రామ్‌రెడ్డి సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించినట్లు శ్యామల పవన్ కుమార్ తెలిపారు.జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వడ్డేపల్లి దినేష్ రెడ్డికి పలువురు నాయకులు, క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల నాయకులు, బిక్కనూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పోసానిపల్లి చిరంజీవులు, అడవి లింగాల నిజాం, దేవునిపల్లి పరంధాములు, నీల రవి తదితరులు పాల్గొని దినేష్ రెడ్డిని అభినందించారు.
