Breaking News

అర్హులైన నిరుపేదల కోసమే ప్రభుత్వ పథకాలు!

మహిళా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

లక్షెట్టిపేట, నవంబర్ 15: (E6tv NEWS).

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు.ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు పలు గ్రామాలకు చెందిన మహిళా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.నూతనంగా పెన్షన్లు మంజూరైన మహిళా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *