ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి
పటాన్‌చెరు, నవంబర్ 15 (E6tv NEWS).
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం ప్రాంతంలో రాయసముద్రం చెరువు వద్ద ఛట్ పూజ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఛట్ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛట్ పూజ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, సూర్య భగవానుడిని ఆరాధిస్తూ భక్తులు ఎంతో నిష్ఠతో ఈ పండుగను జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అప్పల భాస్కర్, సంజయ్ సింగ్, సన్నీ, రాజ్ కుమార్, అమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



