Breaking News

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు

యువతలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించాలి – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, నవంబర్ 04 (E6tv న్యూస్).

కళలకు, క్రీడలకు నిలయంగా ఇందూరు ప్రాంతం నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువతను వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ‘మై భారత్’ కార్యక్రమం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవాభావం పెంపొందించే దిశగా కృషి చేస్తోందన్నారు. యువత విద్య, నైపుణ్యం, క్రీడా స్ఫూర్తి, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.ఇలాంటి యువజనోత్సవాలు యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు, యువ కళాకారులను తన ట్రస్టు ద్వారా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇందూరులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కళాభారతి, క్రీడా స్టేడియం నిర్మాణాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించి ఇందూరు ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ సృజనాత్మక కళలు, క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పోటీల్లో విజయం సాధించిన యువతీ యువకులకు ఎమ్మెల్యే బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అపర్ణ, బాలభవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, న్యాయ నిర్ణేతలు పుష్ప, శ్వేతారెడ్డి, సిర్ప లింగం, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *