Breaking News

వర్షాల ధాటికి చార్మినార్‌ పెచ్చులు ఊడిపడటం: తప్పిన ముప్పు!

హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం చార్మినార్‌పై పెచ్చులు ఊడిపడటంతో అధికారులు తీవ్ర అప్రమత్తమయ్యారు. నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. చార్మినార్‌లోని లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ పైభాగంలో కాంక్రీట్, సున్నపు పూత దెబ్బతిని కింద పడిపోయింది.

వర్షాల ధాటికి సున్నపు పూత తేలిపోయి ఇప్పటికే ఉబ్బిపోవడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది, కింద పడిన పెచ్చులను వెంటనే అక్కడి నుంచి తొలగించారు. ప్రమాద తీవ్రతను దృష్ట్యా పర్యాటక ప్రవేశాన్ని నిలిపివేసి భద్రతా చర్యలు చేపట్టారు. 1591లో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి గతంలోనూ పలుమార్లు మరమ్మతులు చేయగా, మళ్లీ పెచ్చులు ఊడిపడటంతో అధికారులు పునరుద్ధరణ పనులపై దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *