కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి.. వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
చంద్రయన్ పల్లి, అక్టోబర్ 29 (E6tv న్యూస్).
జాతీయ రహదారి నంబర్ 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టడంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి సమీపంలోని ప్రమాదకర ప్రాంతాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చంద్రాయన్పల్లి సమీపంలో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను తనిఖీ చేసిన కమిషనర్.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కల్వర్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే మేనేజర్ (టెక్) రంగారావు, హైవే కాంట్రాక్టర్ బాల్‌రెడ్డిని ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు తప్పనిసరి
జాతీయ రహదారిపై వాహనదారులు వేగాన్ని నియంత్రించుకునేలా అవసరమైన ప్రాంతాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. రాత్రి వేళల్లోనూ ప్రమాదకర ప్రాంతాలు వాహనదారులకు ముందుగానే కనిపించేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ, జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ, కాంట్రాక్టర్లు, టోల్ ప్లాజా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, నేషనల్ హైవే మేనేజర్ రంగారావు, హైవే కాంట్రాక్టర్ బాల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మలేష్, డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. వినోద్, ఇందల్వాయి ఎస్ఐ సుమలత, ఇందల్వాయి సర్పంచ్ రఘు, టోల్ ప్లాజా సిబ్బంది వీరబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.


