Breaking News

పాఠశాల స్థలం కబ్జా చేస్తే ఊరుకోం: బాలాజీ నాయక్ హెచ్చరిక!

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ 276వ డివిజన్ ప్రగతినగర్ వాసవి కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదాన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, దీనిపై సహించేది లేదని మాజీ కార్పొరేటర్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు బాలాజీ నాయక్, బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 16-20 సంవత్సరాలుగా కొనసాగుతూ ప్రస్తుతం 600 నుండి 700 మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న ఈ పాఠశాల ఆవరణపై జీవి భవాని ప్రసాద్ కన్ను పడిందని, ఆర్టీఐ నోటీసులు మరియు లేఖల పేరుతో ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయికి వెళ్లి ఉపాధ్యాయులకు పూర్తి కొండంత అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. పాఠశాల నిర్వహణకు మరియు ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగిస్తే భాను ప్రసాద్ నివాసం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలతో కలిసి శాంతియుత ధర్నా చేపడతామని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల స్థలంపై స్పష్టతనిచ్చి ఉపాధ్యాయులు నిర్భయంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *