వరుస పరాజయాలను పక్కనపెట్టి కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో పాటు, 18వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న తొలి పీరియాడిక్ యాక్షన్ మూవీ కావడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరికొత్త గెటప్పులు, విభిన్న కథాంశంతో వస్తున్న ఈ క్రేజీ జోడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి.

